వ్యూహం

వ్యూహం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళిక. అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చడానికి ఒక చక్కని వ్యూహం చాలా అవసరం. మీరు క్రింది వ్యూహాన్ని పాటించినట్లైతే, ప్రభుత్వ ఉద్యోగం పొందడం అంత కష్టమైన పని కాదు. ఏ పరీక్షకైనా ఈ క్రింది వ్యూహ రచన చాలా చక్కగా సరిపోతుంది.

వ్యూహ రచన (ఏ పరీక్షకైనా)

  1. ముందుగా పరీక్ష మీద అవగాహన పెంచుకోవాలి.
  2. పాత ప్రశ్న పత్రాల సహాయంతో పరీక్ష విధానాన్ని విశ్లేషించండి.
  3. మంచి పుస్తకాలు మరియు వనరులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
  4. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రణాళికని తూ . చ. తప్పకుండా పాటించాలి.
  5. పాత ప్రశ్న పత్రాల ఆన్‌లైన్ పరీక్షల సహాయంతో మీ సంసిద్ధతను తెలుసుకోండి.
  6. పరీక్షకు రెండు వారాల ముందు లేదా నెల రోజుల ముందు ఒకసారి పునర్విమర్శ చేయండి.
  7. పరీక్ష రోజు చాలా ప్రశాంతంగా ఉండాలి.
  8. పరీక్ష గదిలో చాలా పదునుగా ఉండాలి.

పుస్తకాలు మరియు వనరులు

ఏదైనా పరీక్షను ఛేదించడానికి, పుస్తకాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కొన్ని పుస్తకాలు మరియు వనరులు మాత్రమే మీకు విజయాన్ని చేకూరుస్తాయి. అటువంటి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్

ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ పరీక్షలకు చాలా సామీప్యం ఉంది. మీలో చాలా మంది ఈ పరీక్షలన్నింటికి విడివిడిగా సిద్ధం అవుతూ ఉండవచ్చు. కానీ విడివిడిగా తయారైతే, విజయం అంత సులువు కాదు. ఈ మూడు పరీక్షలకి ఉమ్మడిగా చదివితే, విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ పరీక్షల వ్యూహం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply