యూపీఎస్సీ సివిల్ సర్వీసస్, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ – I 

ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ పరీక్షలకు చాలా సామీప్యం ఉంది. మీలో చాలా మంది ఈ పరీక్షలన్నింటికి విడివిడిగా సిద్ధం అవుతూ ఉండవచ్చు. కానీ విడివిడిగా తయారైతే, విజయం అంత సులువు కాదు. ఈ మూడు పరీక్షలకి ఉమ్మడిగా చదివితే, విజయం మిమ్మల్ని వరిస్తుంది. 

పరీక్ష విధానం ఈ మూడింటికీ ఒక్కటే. సిలబస్ కూడా కొద్దిగా అటుఇటుగా ఒకేలాగ ఉంటుంది. పరీక్షలలో అడిగే ప్రశ్నల విధానం, స్థాయి కూడా ఒకే విధంగా ఉంటాయి. చదివే విధానంలో, చదివే పుస్తకాలలో, ప్రణాళికలో ఏటివంటి మార్పు ఉండదు. 

వీటిల్ని సాధించటం కొద్దిగా కష్టమే. కానీ అసాధ్యం కాదు. వీటికి సారూప్యతలతో పాటు, కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే విజయం మీదే. అందువలన ఒకే వ్యూహం ఈ పరీక్షలకు సరిపోతుంది.

సారూప్యతలు (Similarities)

  • ఒకే పరీక్షా విధానం – ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్‌వ్యూ .
  • చాలావరకు సిలబస్ ఒకటే.
  • పరీక్షలలో అడిగే ప్రశ్నల విధానం, స్థాయి ఒకే విధంగా ఉంటాయి.

విభేదాలు (Differences)

యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ఏపీపీఎస్సీ గ్రూప్ – I / టీఎస్పీఎస్సీ గ్రూప్ – I 
జాతీయ అంశాల పైన అధిక దృష్టి పెట్టాలి.జాతీయ అంశాలతో పాటు, రాష్ట్రస్థాయి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలి.
పరీక్ష విధానం, ప్రశ్నల తీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.పరీక్ష విధానం, ప్రశ్నల తీరు సాధ్యమైనంత వరకు ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్నలు ఎక్కువగా విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అంటే మీరు మీ మెదడుకు బాగా మేత పెట్టాలి.ప్రశ్నలు తక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. (Less Analytical questions)
ప్రశ్నలు కొద్దిగా కష్టమైనవిగా ఉంటాయి.ప్రశ్నలు కొద్దిగా సులభమైనవిగా ఉంటాయి.

Leave a Reply